మరింత నష్టాల్లోకి జారిన సూచీలు.. - markets extends loses nifty below 14100
close

Updated : 27/01/2021 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరింత నష్టాల్లోకి జారిన సూచీలు..

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల్లో లాభాల స్వీకరణ సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికి తోడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ విధానంపై కేంద్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు వార్తలు రావడంతో బ్యాంకింగ్‌, చమురు రంగ షేర్లు కుదలేవుతున్నాయి. దీంతో సూచీలు భారీగా నష్టపోతున్నాయి. 

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 500 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ కూడా 14,100 దిగువన ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 557 పాయింట్లు దిగజారి 47,790 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 14,083 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత బలపడి 72.86గా ట్రేడ్‌ అవుతోంది. 

ఇదీ చదవండి..

రూ. 90కి చేరువలో పెట్రోల్‌ ధర


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని