ఈ బడ్జెట్‌ భిన్నం.. ఎందుకంటే..? - why easing taxpayers load in this budget is a good idea
close

Published : 19/01/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ బడ్జెట్‌ భిన్నం.. ఎందుకంటే..?

పన్నుల తగ్గింపే తారక మంత్రం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత్‌ ఇటువంటి సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. కొవిడ్‌ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. చివరి సారి 1979లో  ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేసింది. కానీ, అప్పట్లో ప్రభావం ఈ స్థాయిలో లేదు. కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల ఫలితంగా ఈ పరిస్థితి నెలకొంది. ఆంక్షలు సడలించిన తర్వాత రెండు త్రైమాసికాల్లో వృద్ధిరేటు సాధారణంగా ఉంది. భారత్‌ వేగంగా వృద్ధి చెందాలంటే జీడీపీ 8శాతం చొప్పున పెరగాలి. అప్పుడు గానీ కొవిడ్‌ పూర్వస్థితికి చేరుకోలేం.

ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నాలుగు అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో వ్యయం, పెట్టుబడి, ప్రభుత్వ ఖర్చులు, ఎగుమతులు ఉంటాయి. జీడీపీలో ప్రభుత్వ ఖర్చులు కేవలం 13శాతమే ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రజలు పెట్టే ఖర్చు అత్యధికంగా 55శాతం ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖర్చులు పెరిగినంత మాత్రాన జీడీపీ వృద్ధి ఏకపక్షంగా పెరిగిపోతుందని చెప్పలేం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వ వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన మూడు అంశాల భాగస్వామ్యం అత్యల్పంగా ఉంది. అదే సమయంలో మిగిలిన వ్యయాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికి తోడు కరోనావైరస్‌ అడ్డూఅదుపు లేకుండా వ్యాపిస్తుండటంతో ఎగమతులు పడిపోయాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో ప్రైవేటు పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ప్రభుత్వ ఖర్చులను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యవస్థలో నగదు ప్రవాహం పెంచడానికి అనుకూలంగా ఉన్నా.. చేతిలో ఆ స్థాయిలో నగదు లభ్యత లేదు.

వారే పన్ను చెల్లింపుదారులు కాదు..

పన్నులు చెల్లించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని  ప్రభుత్వాలు తరచూ చెబుతుంటాయి. వాస్తవానికి అది ఆదాయపు పన్ను మాత్రమే. అది ప్రత్యక్ష పన్ను. ఇక కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై విధించే పరోక్ష పన్నులను దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు చెల్లిస్తాడు. మొత్తం వసూలయ్యే పన్నుల్లో వీటి వాటానే అత్యధికంగా ఉంటుంది. అంటే పరోక్ష పన్నుల తగ్గింపు ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఇదే సరైన సమయం..

నాటి పరిస్థితితో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ కొంచెం పుంజుకొంది. ఇలాంటి సమయంలో తీసుకొనే ఆర్థిక ఉపశమన చర్యలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భారత ప్రభుత్వం వివిధ రూపాల్లో పెట్టే ఖర్చులను గణనీయంగా పెంచాలి. లేకపోతే ప్రభుత్వ ఆదాయాలను తగ్గించుకుని.. ఎక్కువ డబ్బు ప్రజలు/సంస్థల చేతిలో ఉండేట్లు చేసి.. వారితో ఖర్చుపెట్టించడం లేదా పెట్టుబడి పెట్టడం వంటివి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీంతో వివిధ రంగాలకు చోదకశక్తి అయిన డిమాండ్‌లో పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా సంస్థలకు సెస్సులు, పన్నుల్లో ఇచ్చే రాయితీల కారణంగా మిగిలే సొమ్ము అదనపు వ్యాపార కార్యలాపాలకు ఉపయోగపడుతుంది. ఫలితంగా ఉద్యోగాలు పెరగడం, పెట్టుబడుల్లో  వృద్ధి కనిపిస్తుంది. ఇలా ఆర్థిక చక్రం తిరగడం మొదలుపెడుతుంది.

ఇదీ చదవండి

ఈసారికి ‘లోటు’పాట్లను పట్టించుకోకుండా..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని