ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే టాప్‌-అప్ లోన్ ట్రై చేయండి..   - Five-major-benefits-of-availing-a-top-up-home loan
close

Updated : 10/06/2021 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే టాప్‌-అప్ లోన్ ట్రై చేయండి..  

నిధుల కొర‌త వ‌ల్ల ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నారా? ఇంటి కొనుగోలు కోసం ఇప్ప‌టికే బ్యాంకులో అప్పు తీసుకున్నారా? మ‌ళ్లీ ఇప్పుడు అప్పు కోసం క్రెడిట్ కార్డు లేదా వ్య‌క్తిగ‌త రుణం తీసుకుందామంటే  వ‌డ్డీ భారం అవుతుంద‌ని ఆలోచిస్తున్నారా? అయితే మీ ముందు మ‌రో ఆప్ష‌న్ కూడా ఉంది. అదే టాప్‌-అప్ హోమ్‌ లోన్‌.

ఇతర వినియోగదారుల మాదిరిగానే, ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారు కూడా.. అదే ఇంటిపై మ‌రోసారి రుణం తీసుకోవ‌చ్చు.  ఇంటి పున‌ర్నిర్మాణం, విస్త‌ర‌ణ, పిల్ల‌ల చ‌దువులు, కారు కొనుగోలు వంటి వాటికి ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది.  రుణ‌దాత‌లు ఈ ఆర్థిక‌ అవ‌స‌రాల‌ను గుర్తించి తుది వినియోగ ప‌రిమితులు లేకుండా ఇప్ప‌టికే గృహం రుణం పొందిన వారికి టాప్‌-అప్ లోన్ ఇవ్వ‌డం ప్రారంభించారు. 

వ్య‌క్తిగ‌త రుణంతో పాటు కారు, క్రెడిట్ కార్డు రుణాలు అందుబాటులో ఉండగా గృహ రుణంపై టాప్‌-అప్‌లోన్ ఎందుకు?  దీని వ‌ల్ల క‌లిగే 5 ప్ర‌ధాన ప్ర‌యోజ‌నాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 

1. త‌క్కువ వ‌డ్డీ రేటు..
సాధార‌ణంగా వ్య‌క్తిగ‌త రుణాలపై, వ‌డ్డీ రేటు 10 నుంచి 24 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఎవ‌రికి ఎంత వ‌ర్తిస్తుంద‌నేది.. అప్పు ఇచ్చే బ్యాంకు, తీసుకునే రుణ‌గ్ర‌హీత క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డు రుణాల‌పై అయితే వ్య‌క్తిగ‌త రుణాల‌ను మించి వ‌డ్డీ రేట్లు ఉంటాయి. మీరు ఇప్ప‌టికే రుణం తీసుకున్న బ్యాంకు నుంచి రుణం తీసుకున్న స‌రే ఈ రుణాల‌పై అధిక వ‌డ్డీ రేట్లే వ‌ర్తిస్తాయి. వీటితో పోలిస్తే గృహ రుణాల వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. టాప్‌-అప్‌లోన్‌ల విష‌యానికి వ‌స్తే.. గృహ రుణంపై వ‌ర్తించే వ‌డ్డీ రేటుతో స‌మానంగా గానీ కాస్త ఎక్కువ‌గా గానీ వ‌డ్డీ ఉంటుంది.  అందువ‌ల్ల ఇప్ప‌టికే గృహ రుణం ఉన్న‌వారు ఇత‌ర రుణాల‌ను తీసుకునేకంటే, అదే బ్యాంకు నుంచి టాప్‌-అప్ లోన్ తీసుకోవ‌డం వ‌ల్ల చౌక‌గా రుణాన్ని పొంద‌చ్చు. 

2. నిధుల వినియోగంపై నిబంధ‌న‌లు లేవు..
టాప్‌-అప్ గృహ రుణాలు.. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న రుణ గ్ర‌హీత‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. కొన్ని ప‌త్ర్యేక సందర్భాల‌లో త‌ప్ప‌.. ఎక్క‌డ ఉప‌యోగిస్తున్నారు అనేదానిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డంతో ఇప్ప‌టికే గృహ రుణం ఉన్న‌వారు.. వ్య‌క్తిగ‌త‌, క్రెడిట్ కార్డు రుణాల‌కు ప్ర‌త్యామ్నాయంగా టాప్‌-అప్ లోన్‌ను ఎంచుకోవ‌చ్చు. 

3. కాల‌వ్య‌వ‌ధి ఎక్కువ‌..
టాప్‌-అప్ గృహ రుణాల కాల‌ప‌రిమితి.. అస‌లు గృహ రుణ‌ కాల‌ప‌రిమితిపై ఆధార‌ప‌డి ఉంటుంది. సాధార‌ణ గృహ రుణం చెల్లించేందుకు ఇంకా 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటే టాప్-అప్ రుణ చెల్లింపుల‌కు ఇంతే కాల‌పరిమితిని ఎంచుకునే అవ‌కాశం ఉంది. కానీ వ్య‌క్తిగ‌త‌, క్రెడిట్ కార్డు రుణ చెల్లింపుల‌కు సాధార‌ణంగా 5 సంవ‌త్స‌రాల కాల‌పరిమితి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఏడేళ్ల కాల‌ప‌రిమితితోనూ వ్య‌క్తిగ‌త రుణాల‌ను మంజూరు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ వీటితో పోలిస్తే, టాప్‌-అప్‌లోన్ తిరిగి చెల్లించేందుకు ఎక్కువ స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి ఈఎమ్ఐ భారం త‌గ్గుతుంది. అయితే కాల‌ప‌రిమితి, ఈమ్ఐ త‌గ్గితే ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని మాత్రం గుర్తుంచుకోండి. 

4. ఎక్కువ రుణం..
టాప్‌-అప్ లోన్ విష‌యంలో రుణం ఎంత మంజూరు చేస్తారు అనేది ప్ర‌స్తుతం ఉన్న గృహ రుణంపై ఆధార‌ప‌డి ఉంటుంది. తీసుకున్న మొత్తం గృహ‌రుణం నుంచి చెల్లించాల్సిన‌ మొత్తం (అవుట్ స్టాండింగ్  అమౌంట్‌)ను తీసివేయ‌గా వ‌చ్చిన మొత్తాన్ని టాప్‌-అప్ లోన్‌గా ఇస్తారు. రుణ గ్ర‌హీత ఆదాయం, తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టి రూ.50వేల నుంచి 40 ల‌క్ష‌ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త రుణాన్ని ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డుల‌పై అయితే కార్డుదారుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా రుణం ఇస్తారు.  కొన్ని బ్యాంకులు క్రెడిట్ లిమిట్ మించి కూడా రుణం ఇస్తున్నాయి. 

టాప్-అప్‌లోన్ ద్వారా ఎక్కువ మొత్తాన్ని రుణంగా పొందే అవ‌కాశం ఉంది.  ప్రత్యేకించి అసలు గృహ రుణ మొత్తంలో ఎక్కువ భాగాన్ని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో చెల్లించిన వారికి ఎక్కువ రుణం ల‌భిస్తుంది. 

5. క్విక్ ప్రాస‌స్‌, డాక్యుమెంటేష‌న్..
రుణ‌దాత‌లు సాధార‌ణంగా ఒక‌టి నుంచి రెండు వారాల వ్య‌వ‌ధిలోనే గృహ రుణాన్ని మంజూరు చేస్తాయి. క్రిడిట్ కార్డుపై త‌క్ష‌ణ‌మే లేదా ద‌ర‌ఖాస్తు చేసిన కొద్ది గంట‌లోనే రుణం ల‌భిస్తుంది. వ్య‌క్తిగ‌త రుణాల‌కు 2 నుంచి 7 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. రుణాల‌ను వేగంగా ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో కొంత మంది రుణ‌దాత‌లు, ముంద‌స్తుగా ఆమోదించిన వ్య‌క్తిగ‌త రుణాలు ఇస్తున్నాయి. వెంట‌నే రుణం కావాల‌నుకునేవారికి క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాలు అందుబాటులో ఉంటాయి. 

ప్ర‌స్తుతం ముందుగా ఆమోదించిన‌ టాప్‌-అప్ గృహ రుణాల‌ను ఇస్తున్నాయి కొన్ని బ్యాంకులు. ఒక‌వేళ అటువంటి బ్యాంకులో మీరు గృహ రుణం పొందివుంటే చాలా కొద్ది స‌మయంలోనే టాప్‌-అప్‌లోన్‌ను పొంద‌వ‌చ్చు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని