close

మారుతీ కార్లు ప్రియం

దిల్లీ: అగ్రగామి కార్ల సంస్థ మారుతీ సుజుకీ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10,000 వరకు ధరలు పెంచింది. ముడివస్తువుల ధరలు పెరగడం, విదేశీ మారక రేట్లు ప్రతికూల ప్రభావం చూపడమే ఇందుకు కారణమని మారుతీ సుజుకీ తెలిపింది. కంపెనీ పలు మోడళ్ల ధరలు పెంచినప్పటికీ.. ఇటీవల విడుదల చేసిన ఎర్టిగా కొత్త మోడల్‌ ధరను మాత్రం యథాతథంగా కొనసాగించనుంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ చిన్న కారు ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాస్‌ఓవర్‌ ఎస్‌-క్రాస్‌ శ్రేణిలో కార్లను విక్రయిస్తోంది. పెంచక ముందు వీటి ధరలు రూ.2.53- 11.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ) శ్రేణిలో ఉన్నాయి. కంపెనీ ధరలు పెంచనున్నట్లు గత నెలలోనే ప్రకటించింది. అయితే ఎంత స్థాయిలో పెంచనుందో మాత్రం వెల్లడించలేదు. ఈ నెల ప్రారంభం నుంచి టయోటా, ఇసుజు సహా వివిధ కంపెనీలు మోడళ్ల ధరలు పెంచాయి.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.