Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 May 2024 09:04 IST

1. నిషేధమన్నావు.. నిషాలో ముంచావు!

మాటతప్పను.. మడమ తిప్పను అన్న జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని పక్కనపెట్టేశారు. అనకాపల్లి జిల్లాలో 151 మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా ఏటా అమ్మకాలు పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం రాగా వాటిని తాగినవారు మాత్రం ఆసుపత్రి పాలవుతున్నారు. పూర్తి కథనం

2. దేశంలో తొలి ప్రైవేట్‌ రైలు జూన్‌ 4 నుంచి చుక్‌ చుక్‌

దేశంలోనే తొలి ప్రైవేట్‌ రైలు సర్వీసు జూన్‌ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. ఎస్‌ఆర్‌ఎంపీఆర్‌ గ్లోబల్‌ రైల్వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది. ఈ రైలు ప్రధానలక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం. భారత్‌ గౌరవ్‌యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేటు రైలు సర్వీసును నిర్వహించనున్నారు.పూర్తి కథనం

3. మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?

ఉయ్యూరు పట్టణంలోని టిడ్కో గృహాలు అందక లబ్ధిదారులు నానా అవస్థలుపడుతుంటే.. మరోవైపు రూ.వేలు డిపాజిట్‌ చెల్లించి అనర్హులుగా ప్రకటితులైన బాధితులు తమ సొమ్ము కోసం వైకాపా నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక, వివిధ కారణాల వల్ల గృహాలు రాక బాధపడుతుంటే.. న్యాయంగా వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా ప్రభుత్వం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోంది.పూర్తి కథనం

4. ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ

ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్‌ లిస్టులు వందలు దాటేశాయి. పలు రైళ్లలో ఏకంగా రిగ్రెట్‌కు వెళ్లిపోయాయి. ఇక మిగిలిన ఆధారం ప్రైవేటు బస్సులే. వచ్చే సోమవారం ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు ముఖ్య ప్రాంతాల నుంచి ఏపీ వైపు ఈ వారాంతంలో భారీగా ప్రయాణాలు ఉన్నాయి.పూర్తి కథనం

5. హలో పుంగనూరు.. బైబై పాపాల పెద్దిరెడ్డి

‘పుంగనూరు ప్రజలకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చింది. రేపటి నుంచి అంతా మంచి రోజులే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిడిసిపడుతున్నారు. నియోజకవర్గంలో శివశక్తి డెయిరీ కాకుండా వేరే డెయిరీ పోతుందా? అదే మా ఊళ్లో (నారావారిపల్లె)లో అన్ని డెయిరీలు పోతున్నాయి. ఇదేమైనా నీ జాగీరా? మీ అబ్బ సొత్తా? మామిడి కాయల్లోనూ కమీషన్లు కొట్టేసిన దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి.పూర్తి కథనం

6. విదేశాల్లో ఓటుహక్కు ఇలా..

ఓటు హక్కు సద్వినియోగంపై ఎన్నికల సంఘం అధికారులు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ పోలింగ్‌ శాతం పెంపు పూర్తిస్థాయిలో ఉండటం లేదు. బాధ్యతగా హక్కును వినియోగిస్తేనే సమస్యల పరిష్కారంపై ప్రజా ప్రతినిధులను నిలదీసే ఆస్కారం ఉంటుంది. ఓటు కలిగి ఉన్న ప్రతిఒక్కరూ తమకు నచ్చిన నాయకులకు ఓటేసి తీరాల్సిందే. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం అధికారులు ఒక గంటపాటు సమయాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.పూర్తి కథనం

7. రేవులో తేలిన జగన్‌ హామీలు..!

తూర్పు తీరంలో విశాఖ చేపలరేవు అతి పెద్దది. వేలాది మంది మత్స్యకారులు, బోటు ఆపరేటర్లు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. వీరికిచ్చిన హామీల్లో అధికశాతం అమలు కాలేదు. ఏడాదిగా చేపలరేవు అభివృద్ధి ఒక అడుగు ముందుకు..నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది.పూర్తి కథనం

8. ఒక్క వానకే.. వణికె

హైదరాబాద్‌: అకాలవర్షం నగరంపై విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురుగాలులతో అస్తవ్యస్తం చేసింది. నిప్పుల కుంపటిలా మారిన నగరానికి వరుణుడు ఉపశమనం కలిగించినా.. విద్యుత్తు తీగలు తెగటం, చెట్లకొమ్మలు విరిగిపడడం.. ట్రాఫిక్‌ స్తంభించి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పూర్తి కథనం

9. జనం ఆస్తులపై జగనాసుర చట్టం

వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కుచట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌) అమలుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూ సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక సార్లు అర్జీలు దాఖలు చేసినా పరిష్కరించిన దాఖలాలు లేవు.  పూర్తి కథనం

10. హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు

ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ గెలుపు అవకాశాలను ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సర్వే ఏజెన్సీలను సంప్రదిస్తుంటారు. అభ్యర్థులు ఏజెన్సీలకు పెద్దమొత్తంలో చెల్లిస్తుండటంతో గతంలో పదుల సంఖ్యలో ఉన్న ఏజెన్సీలు ప్రస్తుతం వందల సంఖ్యలో పెరిగాయి. గతంలో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి వారు వెల్లడించే అభిప్రాయాలపై సర్వే చేసి నివేదికలు సమర్పించేవారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు