close
మళ్లీ బేర్‌మంది

అమ్మకాల వైపు మదుపర్ల మొగ్గు
సెన్సెక్స్‌కు 204 పాయింట్ల నష్టం
11,200 దిగువకు నిఫ్టీ
సమీక్ష

సూచీల లాభాలు ఒక్క రోజు ముచ్చటగా మారింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, సాధారణ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితితో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఇంట్రాడేలో దాదాపు 500 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సూచీలు.. చివరకు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్లు స్థిరంగా అమ్మకాలు కొనసాగించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలపడి 70.34 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు బలంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 37,539.05 పాయింట్ల వద్ద సానుకూలంగానే ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 37,559.67 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. చివరి గంట ట్రేడింగ్‌లో నష్టాల్లోకి జారుకుంది. ఒకానొకదశలో 37,047.87 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. చివరకు 203.65 పాయింట్ల నష్టంతో 37,114.88 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 11,200 దిగువకు చేరింది. 65.05 పాయింట్లు తగ్గి 11,157 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,136.95- 11,286.80 పాయింట్ల మధ్య కదలాడింది.

* బోర్డులో ఆర్‌బీఐ నామినీని నియమించడంతో యెస్‌ బ్యాంక్‌ షేరు కుప్పకూలింది. ఇంట్రాడేలో 8.74 శాతం పడిన షేరు.. రూ.142.50 వద్ద 52 వారాల కనిష్ఠానికి చేరింది. చివరకు 8.01 శాతం నష్టంతో రూ.143.65 వద్ద ముగిసింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.2,873.42 కోట్లు తగ్గి రూ.33,275.58 కోట్లకు చేరింది.
* జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్ల పతనం కొనసాగింది. కంపెనీ సీఈఓ వినయ్‌ దూబేతో సహా పలువురు ఉన్నతాధికారులు రాజీనామా చేయడంతో ఇంట్రాడేలో షేరు 6.85 శాతం తగ్గి రూ.120.25 వద్ద 52 వారాల కనిష్ఠానికి చేరింది. చివరకు 4.18% నష్టంతో రూ.123.70 వద్ద ముగిసింది.
* బలహీన త్రైమాసిక ఫలితాలతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు కుదేలైంది. ఒకానొకదశలో 10.72 శాతం కోల్పోయిన షేరు.. రూ.70.75 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 10.03 శాతం నష్టంతో రూ.71.30 దగ్గర స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 నష్టాలు చవిచూశాయి. టాటా మోటార్స్‌ 8%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.66%, కోల్‌ ఇండియా 2.75%, సన్‌ఫార్మా 2.67%, పవర్‌గ్రిడ్‌ 1.65%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.41%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.40%, టాటా స్టీల్‌ 1.39%, హిందుస్థాన్‌ యునిలీవర్‌ 1.38%, ఎన్‌టీపీసీ 1.31% చొప్పున డీలాపడ్డాయి.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.