close
టాటా టిగోర్‌ ఆటోమేటిక్‌

ధరల శ్రేణి రూ.6.39-7.24 లక్షలు

దిల్లీ: టాటా మోటార్స్‌ నుంచి ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌లో కాంపాక్ట్‌ సెడాన్‌ టిగోర్‌ కార్లు విపణిలోకి విడుదలయ్యాయి. ఎక్స్‌ఎంఏ, ఎక్స్‌జెడ్‌ఏ+ ఏఎంటీ శ్రేణిలో విడుదలైన ఈ కార్ల ధరల శ్రేణి రూ.6.39-7.24 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు కార్లు 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందాయి. ‘వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకొచ్చిన ఉత్పత్తులివి. ఆటోమేటిక్‌ పోర్ట్‌ఫోలియోలో మా ఉత్పత్తులను నిరంతరం పెంచుకుంటూ పోవడంతోపాటు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామ’ని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన వ్యాపార విభాగ (పీవీబీయూ) వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌) ఎస్‌ఎన్‌ బర్మన్‌ వెల్లడించారు. డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, యాంటీ-లాక్‌ బ్రేక్స్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌-ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌, కార్నర్‌ స్టెబిలిటీ నియంత్రణ, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, స్పీడ్‌ డిపెండెంట్‌ ఆటోమేటిక్‌ డోర్‌ లాకింగ్‌, ఇంజిన్‌ ఇమ్మొలిలైజర్‌ వంటి భద్రతా ప్రమాణాలతో ఈ కార్లను రూపొందించినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.