కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్‌ లభ్యం - Black Box Recovered From Crashed Air INdia Flight
close
Published : 09/08/2020 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్‌ లభ్యం

కొలికోడ్‌: కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం నుంచి బ్లాక్బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందులో ఉండే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా‌ రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా.. విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు.. ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి. దీంతో ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఐఎక్స్‌-1344 విమానంలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే వీలవుతుందని అధికారులు తెలిపారు.

దుబాయి నుంచి కొలికోడ్‌‌కు వస్తున్న ఈ విమానం రన్‌వేపై అదుపుతప్పి జారిపడటంతో రెండు ముక్కలైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని