ఆక్సిజన్‌ సాయంతో ICUలో చికిత్స పొందాను - I was on oxygen support in the ICU says Harshvardhan Rane
close
Published : 26/10/2020 23:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ సాయంతో ICUలో చికిత్స పొందాను

నటుడు హర్షవర్ధన్‌ రాణే

ముంబయి: కొవిడ్‌-19 సోకడంతో తన ఆరోగ్యం దెబ్బతినిందని నటుడు హర్షవర్ధన్‌ రాణే తెలిపారు. ‘తకిట తకిట’ సినిమాతో నటుడిగా కెరీర్‌ ఆరంభించిన ఆయన పలు తెలుగు సినిమాల్లో నటించారు. ‘నా ఇష్టం’, ‘అవును’, ‘అనామిక’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’, ‘ఫిదా’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు. ‘సనమ్‌ తేరీ కసమ్‌’తో కథానాయకుడిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో తన తర్వాతి సినిమా ‘తైష్‌’ ప్రచారంలో కూడా పాల్గొనలేకపోయానని తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఆయనతోపాటు పుల్కిత్‌ సామ్రాట్‌, కృతి కర్బందా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. అక్టోబరు 29న ఓటీటీ వేదికగా జీ5లో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. ‘నేను నాలుగు రోజులపాటు ఐసీయూలో ఉన్నా. ఆక్సిజన్‌ సాయంతో ఊపిరి పీల్చుకున్నా. నా సినిమాను ప్రమోట్‌ చేసుకోలేకపోతున్నానని బాధపడ్డా. తొలుత తలనొప్పి, స్వల్ప జ్వరం వచ్చాయి. నాలుగు రోజులు గడిచినప్పటికీ తలనొప్పి తగ్గలేదు. దీంతో ఆసుపత్రికి వెళ్లా. ఇది కేవలం వైరల్‌ జ్వరమని వైద్యలు చెప్పారు. ఆపై కరోనా పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. రెండు రోజులైనా జ్వరం, తలనొప్పి తగ్గకపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లా. నా ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఐసీయూకి తరలించి, చికిత్స చేశారు’ అని చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని