రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్‌ ముందురోజు పంపకాలకు సన్నాహాలు

ఎప్పుడో బటన్‌ నొక్కి, నెలల తరబడి పెండింగ్‌లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్‌ ముందురోజు పంచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 09 May 2024 08:14 IST

ఈనాడు, అమరావతి: ఎప్పుడో బటన్‌ నొక్కి, నెలల తరబడి పెండింగ్‌లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్‌ ముందురోజు పంచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌కు అన్ని రకాలుగా మద్దతు పలుకుతున్న సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌, కార్యదర్శి సత్యనారాయణ పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి మరీ పథకాల సొమ్ములు పోలింగ్‌ ముందు పంచాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అలా వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు జగన్‌ అనుకూల యంత్రాంగం కంకణం కట్టుకుంది. ఒకవైపు ఈ మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రూ.3,000 కోట్ల మేర రుణం సమీకరించింది. మరోవైపు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీచేసి రూ.7,000 కోట్ల రుణం సమీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ రుణానికి రాష్ట్రప్రభుత్వం ఎప్పుడో గ్యారంటీ ఇచ్చింది. ఈ లోపు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని అధికార యంత్రాంగం చూస్తోంది. లేకపోతే ఇతరత్రా మార్గాలు వెతుకుతోంది. పోలింగ్‌కు ఒకరోజు ముందైనా లబ్ధిదారులకు ఆ సొమ్ములు చేర్చే యత్నాలు సాగిస్తున్నారు. 2023 ఖరీఫ్‌లో కరవు వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.847 కోట్లు చెల్లించాలి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.610 కోట్ల చెల్లింపులు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రకాల బకాయిలు ఆగిపోయాయి. మార్చి మొదటి వారంలోనే వీటి చెల్లింపులకు బటన్‌ నొక్కినా ఇంతవరకు చెల్లింపులు పూర్తికాలేదు. చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలకు ఇంకా నిధులు చెల్లించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు