ఉమ్మడి కమిటీతో అభ్యర్థి ఎంపిక: పవన్‌ - Janasena Chief Pawan Kalyan with Media
close
Updated : 26/11/2020 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉమ్మడి కమిటీతో అభ్యర్థి ఎంపిక: పవన్‌

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ ముగిసింది. అనంతరం దిల్లీలో పవన్‌ మీడియాతో మాట్లాడారు. నడ్డాతో భేటీలో అమరావతి, పోలవరం అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనకు జనసేన-భాజపా మద్దతు ఉంటుందని పవన్‌ పునరుద్ఘాటించారు. పోలవరంపైనా స్పష్టత ఇవ్వాలని నడ్డాను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి విధానాలు, శాంతిభద్రతలు, ఆలయాలపై దాడుల వ్యవహారంపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు వివరించారు.  తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిని త్వరలో నిర్ణయిస్తామన్నారు. దీనిపై ఇరు పార్టీల ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని పవన్‌ చెప్పారు. ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ సమావేశంలోనే నిర్ణయిస్తామన్నారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని