
తాజా వార్తలు
కంగనపై దావా కేసు.. కోర్టుకు జావేద్ అక్తర్
ముంబయి : బాలీవుడ్ నటి కంగన రనౌత్‌పై పరువు నష్టం దావా వేసిన ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ కోర్టుకు హాజరయ్యారు. దావాకు సంబంధించి కేసు వేసిన వ్యక్తి కోర్టులో హాజరై వాదనలు వినిపించాలన్న ఆదేశాల మేరకు ఆయన గురువారం అంథేరీ న్యాయస్థానానికి వెళ్లారు. దావాకు సంబంధించిన పరిశీలన పూర్తి అయిందన్న న్యాయస్థానం తదుపరి వాదనలను డిసెంబరు 19 విననున్నట్లు తెలిపింది. తన పరువుకు భంగం కలిగేలా కంగన పలు మీడియా ఛానళ్లలో వ్యాఖ్యలు చేసినట్టు జావేద్ అక్తర్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్టరీకి సంబంధించి న్యాయం జరగాలని కంగనా ట్విటర్ వేదికగా పలుమార్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు ఛానళ్లలో దీనిపై మాట్లాడారు. ఈ సందర్భంగా కంగన తన పేరును సుశాంత్ కేసులోకి అన్యాయంగా లాగినట్లు ఆయన తెలిపారు. తనపై కంగన వ్యాఖ్యలు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 14న తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిచెందిన విషయం తెలిసిందే. హీరో డెత్ మిస్టరీపై సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
