‘ఖైదీ’కి అరుదైన గౌరవం - Khaidi selected for screening at International Indian Film Festival Toranto
close
Updated : 08/07/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖైదీ’కి అరుదైన గౌరవం

హైదరాబాద్‌: తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు కార్తి. ఆయన కీలక పాత్రలో లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖైదీ’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కథ, బిగి సడలని కథనం, లోకేశ్‌ కనరాజ్‌ టేకింగ్‌, కార్తి నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

ఇప్పుడు ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ జరిగే టొరంటో ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్టు 12న ‘ఖైదీ’ ప్రదర్శిస్తారని చిత్ర నిర్మాతలు కె.కె.రాధామోహన్‌, ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు తెలిపారు. ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

కథేంటంటే: ఢిల్లీ (కార్తి) పదేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలవుతాడు. ఆశ్రమంలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు తహతహలాడుతుంటాడు. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీస్‌కు సహాయం చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఢిల్లీకి సమస్యలు ఎదురవుతాయి. ఢిల్లీ, పోలీసు అధికారిని అడ్డుకోవటానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. ఆ ముఠా నుంచి పోలీసు అధికారిని రక్షించి, పోలీసు డిపార్ట్‌మెంట్‌ పరువు కాపాడే బాధ్యతను ఢిల్లీ తన భుజాలపై వేసుకుంటాడు. అసలు ఢిల్లీ ఎవరు? ఎందుకు జైలుకు వెళ్లాడు? అతడిని, పోలీసు అధికారిని తరుముతున్న ఆ ముఠా కథేంటి? ఢిల్లీ తన కూతురిని చూడగలిగాడా? లేదా? అన్నదే  కథ.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని