ప్రపంచ కుబేరుల్లో ముఖేశ్‌ @ 4 - Mukesh Ambani become worlds No 4
close
Updated : 08/08/2020 21:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచ కుబేరుల్లో ముఖేశ్‌ @ 4

ముంబయి: ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ మరో మైలురాయిని అధిగమించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన మరో మెట్టు పైకి ఎక్కారు. బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను దాటేసి 80.6 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముఖేశ్‌ నాలుగో స్థానంలో నిలిచారు.

ముఖేశ్‌ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌, సెర్జె బ్రిన్‌, ల్యారీ పేజ్‌, వారెన్‌ బఫెట్‌ వంటి దిగ్గజాలను దాటేశారు. ప్రస్తుతం ఈ జాబితాలో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ 187 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బిల్‌గేట్స్‌ 121 బిలియన్‌ డాలర్లతో రెండోస్థానంలో నిలిచారు. 102 బిలియన్‌ డాలర్లతో ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకర్‌ బర్గ్‌  మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆర్నాల్ట్‌ 80.2 బిలియన్‌ డాలర్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యారు. 

ఈ ఏడాది ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు పడిపోవడంతో ఆర్నాల్ట్‌ సంపద 25.1 బిలియన్‌ డాలర్ల మేర కోసుకుపోయింది. అదే సమయంలో ముకేశ్‌ సంపద 22 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా ఆయిల్‌ మార్కెట్‌ దెబ్బతిన్నప్పటికీ.. రిలయన్స్‌ డిజిటల్‌ విభాగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ముఖేశ్‌కు కలిసొచ్చింది. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా ఎగిశాయి. మరోవైపు ముఖేశ్‌ ఇప్పటికే ఈ-కామర్స్‌ వ్యాపారంపై దృష్టి సారించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని