‘పుష్ప’ రాజ్‌ వచ్చేస్తున్నాడు..! - Pushpa Shooting Resumes From Tomorrow
close
Published : 09/11/2020 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పుష్ప’ రాజ్‌ వచ్చేస్తున్నాడు..!

స్పెషల్‌ గ్లిమ్స్‌ షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా కొన్నినెలలపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు అటవీ ప్రాంతాల్లో ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో ‘పుష్ప’ అప్‌డేట్‌ కోసం స్టైలిష్‌ స్టార్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కి సైతం అభిమానులు సందేశాలు పంపుతున్నారు. ఈ మేరకు తాజాగా ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన స్పెషల్‌ గ్లిమ్స్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్‌ గురించి ఈ స్పెషల్‌ వీడియోలో చూపించారు. అంతేకాకుండా నవంబర్‌ 10(మంగళవారం) నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్య కథతో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో బన్నీకి జంటగా నటి రష్మిక సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని