ఐదుగురు టాప్‌ దర్శకులు.. ఐదు కథలు - Putham Pudhu Kaalai film official trailer released
close
Updated : 06/10/2020 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదుగురు టాప్‌ దర్శకులు.. ఐదు కథలు

లాక్‌డౌన్‌లో చిత్రీకరణ.. ట్రైలర్‌ చూడండి

చెన్నై: ఐదుగురు ప్రముఖ తమిళ దర్శకులు లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఐదు కథలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, సుహాసిని మణిరత్నం, సుధ కొంగర, రాజీవ్‌ మేనన్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌ కలిసి ‘పుతం పుదు కాలై’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. లాక్‌డౌన్‌లో కుటుంబాలు, మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయనే నేపథ్యంలో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘మోదీ 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించారు..!’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘21 రోజులా...!!..’ అని కొందరు ఆశ్చర్యపోతే, మరి కొందరు ఆనంద పడుతూ కనిపించారు. ‘లాక్‌డౌన్‌ పూర్తయింది తాత.. బయట ప్రపంచాన్ని చూసే సమయం వచ్చింది..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ముగిసింది.

ఈ చిత్రంలో జయరాం, ఊర్వశి, కల్యాణి ప్రియదర్శన్‌, రీతూ వర్మ, శ్రుతి హాసన్‌, సుహాసిని, అను హాసన్‌, ఆండ్రియా, కాళిదాస్‌ జయరామ్‌ తదితరులు నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. అక్టోబరు 16న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని