ఆటో సేవలను ప్రారంభించిన ర్యాపిడో.. - Rapido forays into auto rickshaw booking
close
Published : 16/10/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆటో సేవలను ప్రారంభించిన ర్యాపిడో..

ఇంటర్నెట్‌ డెస్క్‌: బైక్‌ ట్యాక్సీలతో ప్రాచుర్యం పొందిన ర్యాపిడో తన సేవలను విస్తరించింది. ఇకపై ఆటో రిక్షా సేవలనూ అందించనుంది. ఇందులో భాగంగా గురువారం 14 నగరాల్లో ఆటో రిక్షా బుకింగ్‌ సేవలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ఇందుకోసం రాబోయే ఆరు నెలల్లో 5 లక్షల మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కరోనా మహమ్మారి అనంతం బైక్‌ ట్యాక్సీల తర్వాత ఆటో రిక్షాలే రాకపోకలకు ఉత్తమ ఎంపిక కాగలదని సంస్థ సహ వ్యవస్థాపకులు అరవింద్‌ శంక అన్నారు. ‘‘ఆటో సేవా పరిశ్రమ బాగా వృద్ధి చెందినప్పటికీ, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దీని మార్కెట్‌ 5 శాతం మాత్రమే ఉంది. మా బైక్‌ ట్యాక్సీ సేవనే కాకుండా ర్యాపిడో ఆటో ద్వారా ప్రయాణికులకు మరో సురక్షితమైన, సరసమైన ధరలో ప్రయాణించే అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 20 వేల మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేర్చుకున్నాం. సాంకేతికంగాను, భౌగోళికంగాను మాకున్న అనుభవంతో బైక్‌ ట్యాక్సీ మాదిరిగానే ఆటోల ద్వారానూ వినియోగదారులకు సేవలు అందిస్తాం’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని