ధోని కిచిడీ.. కోహ్లీ ఖమన్‌.. రోహిత్‌ ఆలూ రషిలా..! - ahmedabad hotels special cricket theme meal
close
Published : 13/03/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోని కిచిడీ.. కోహ్లీ ఖమన్‌.. రోహిత్‌ ఆలూ రషిలా..!


(ఫొటో: కోర్ట్‌యార్డ్‌అహ్మదాబాద్‌ ఇన్‌స్టా)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏంటి అవన్నీ పేర్లు విచిత్రంగా ఉన్నాయని తికమకపడుతున్నారా?అవి వంటకాల పేర్లండి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న కోర్ట్‌యార్డ్‌ హోటల్‌ క్రికెటర్ల పేర్లతో వినూత్నంగా వంటకాలను తయారు చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో టీమిండియా ఘన విజయం, భారత్‌-ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేపథ్యంలో భారతీయులు ఎంతో ఇష్టపడే క్రికెట్‌ను.. వంటకాలను కలిపేసి ప్రత్యేకమైన ‘మొతెరా థాలి’ని సిద్ధం చేసింది. ఐదు అడుగుల విస్తీర్ణం ఉన్న కంచెంలో ధోని కిచిడీ, కోహ్లీ ఖమన్‌, రోహిత్‌ ఆలూ రషిలా, భువనేశ్వర్‌ భర్ట, హర్భజన్‌ హండ్వో, బౌన్సర్‌ బసుండి, బుమ్రా భిండి సిమ్లామిర్చ్‌, శార్దూల్‌ శ్రీఖండ్‌ తదితర పేర్లతో ఆహార పదార్థాలను పెట్టారు.

ఇటీవల ‘ది మొతెరా థాలి ఛాలెంజ్‌’ను కూడా కోర్ట్‌యార్డ్‌ హోటల్‌ నిర్వహించింది. ఎవరైనా సరే ఒక్కరు లేదా స్నేహితులు, కుటుంబసభ్యుల(గరిష్ఠంగా నలుగురు)తో కలిసి గంటలోగా ఈ థాలిని తినగలితే వారిని విజేతలుగా ప్రకటిస్తామని యాజమాన్యం తెలిపింది. భారత మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ తన స్నేహితులతో కలిసి ఈ మొతెరా ఛాలెంజ్‌లో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా ఈ థాలి హాట్‌ టాపిక్‌గా మారింది. కోర్ట్‌యార్డ్‌ హోటల్‌ నేటి నుంచి 21వ తేదీ వరకు ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని