ఐదు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌: డా.శ్రీనివాస్‌ - corona vaccine given to two voulnteers
close
Updated : 20/07/2020 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌: డా.శ్రీనివాస్‌

హైదరాబాద్‌: ఇవాళ నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసులు ఇచ్చినట్లు క్లినికల్‌ ట్రయల్స్‌ బృందం సభ్యుడు.. డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన ‘కోవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ను ఇద్దరు వాలంటీర్లకు ఇవ్వగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు మా ప్రయత్నం కొనసాగిస్తాం. ఐదు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ఉంటాయి. నిమ్స్‌లో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇతర దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పటికే మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తయ్యాయి. రష్యా, చైనా, యూకె, లండన్‌లో సెప్టెంబర్‌ వరకు ట్రయల్స్‌ పూర్తవుతాయి. అయితే అక్టోబర్‌ నాటికి కరోనా వ్యాక్సిన్‌ తీసుకొస్తామని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది’’అని శ్రీనివాస్‌ తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని