ఈ 37 జిల్లాల్లో ఆందోళనకరంగా కొవిడ్‌ కేసుల పెరుగుదల - covid-19 these 37 districts of concern in 9 states are driving indias surge
close
Updated : 10/08/2021 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ 37 జిల్లాల్లో ఆందోళనకరంగా కొవిడ్‌ కేసుల పెరుగుదల

దిల్లీ: రెండు వారాలుగా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 37 జిల్లాల్లో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వారపు కొవిడ్‌ పాజిటివిటి శాతం 10కిపైగానే ఉందని మంగళవారం వెల్లడించింది. ఒక్క కేరళలోనే లక్షకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది.

కేసులు పెరుగుతున్న జిల్లాలు ఇవే..
* కేరళ: మలప్పురం, ఎర్నాకుళం, త్రిశూర్‌, కొయ్‌కోడ్‌, పాలక్కడ్‌, కొల్లాం, కన్నూర్‌, కాసర్‌గోడ్‌, వయనాడ్‌, పథనంతిట్ట, ఇడుక్కి
* తమిళనాడు: కొయంబత్తూరు, చెన్నై, ఈరోడ్‌, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, పుదుకొట్టై, అరియాలుర్‌
* హిమాచల్‌ప్రదేశ్‌: హమీర్‌పూర్‌, కాంగ్రా, బిలాస్‌పూర్‌, చంబా, మండీ, శిమ్లా
* కర్ణాటక: కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చామరాజనగర, ఉడుపి
* ఆంధ్రప్రదేశ్‌: శ్రీకాకుళం, తూర్పు గోదావరి
*మహారాష్ట్ర: సోలాపూర్‌, బీడ్‌
* పశ్చిమ బెంగాల్‌: ఉత్తర 24 పరగణాలు, నదియా
* మేఘాలయ: పశ్చిమ ఖాసీ హిల్స్‌
* మిజోరాం: సయిహామరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని