వాటికే పరిమితం అవ్వాలనుకోవడం లేదు - do not want to be limited to themselves vani kapoor
close
Published : 19/02/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాటికే పరిమితం అవ్వాలనుకోవడం లేదు

ముంబయి: ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన బాలీవుడ్ కథానాయిక వాణీ కపూర్. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళంలో తెరకెక్కిన ‘ఆహా కల్యాణం’ చిత్రంలో సందడి చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ‘షంషేరా’, ‘బెల్ బాటమ్’, ‘చండీఘర్ కరే ఆషికి’ చిత్రాల్లో నటిస్తోంది. అవన్నీ ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. వాణీ తన సినీ పాత్రలపై స్పందిస్తూ..

‘‘నేను ఒకే జోనర్లో ఉండిపోవడానికి లేదా మూసలాంటి పాత్రలు పోషించడానికి పరిమితం అవ్వాలనుకోవడం లేదు. ఓ నటిగా అన్నీ రకాల పాత్రలు పోషించి అభిమానుల మన్ననలను పొందాలనుకుంటున్నా. సాధ్యమైనంత వరకు కొత్త ప్రయోగాలు చేయాలని ఉంది. ప్రేక్షకులు నన్నుగా గుర్తుంచుకునే ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించాలని ఉంది. ఈ ఏడాదిలో  మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హై-కాన్సెప్ట్ కంటెంట్ కలిగిన చిత్రాల్లో నటిస్తుండడం నా అదృష్టమని’’ అన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని