సామాజిక దూరం అంటే ఇదే కదా: మహీంద్రా
close
Published : 25/04/2020 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సామాజిక దూరం అంటే ఇదే కదా: మహీంద్రా

దిల్లీ: కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం అని ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు ఈ నిబంధనను అలవాటుగా మార్చుకుంటున్నారు. తాజాగా సామాజిక దూరం ప్రాముఖ్యతను ఉదహరిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వాల ప్రచారాన్ని తలకెక్కించున్న ఓ ఎలక్ట్రిక్‌ ఆటోడ్రైవర్‌ తన బాధ్యతగా చేసిన పని మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆటోడ్రైవర్‌ ఏం చేశాడంటే.... తన ఆటోలో ప్రయాణించే వారి మధ్య సామాజిక దూరం ఉండే విధంగా ఆటోను నాలుగు భాగాలుగా విభజించాడు. అందులో ప్రయాణికులకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా మధ్యలో అడ్డుగా ఇనుప ఫ్రేములతో పరదాలను ఏర్పాటు చేశాడు. దీని వల్ల ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండటమే కాకుండా, ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయింది. 

దీనికి సంబంధించిన వీడియోని మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేస్తూ... ‘‘నూతన పరిస్థితులకు తగినట్లు సరికొత్త ఆవిష్కరణలు చేపట్టే మన ప్రజల సామర్థ్యాలు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. రాజేష్‌ (మహీంద్రా ఆటోమొబైల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌), మన కంపెనీ పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణల విభాగానికి సలహాదారుగా ఈ వ్యక్తిని (ఆటోడ్రైవర్‌) తప్పకుండా చేర్చుకోవాలి’’ అని కామెంట్ జత చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను దాదాపు 75 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అవసరమే అన్నింటిని నేర్పిస్తుంది’, ‘ప్రయాణంలో సామాజిక దూరం - అద్భుతమైన ఆలోచన’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చదవండి:

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే.. అంబులెన్స్‌ ఎక్కిస్తారు

లాక్‌డౌన్‌ విధించకుంటే 73వేలు దాటేవి!

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని