ఇక అక్షయ్‌ వంతు.. ‘వైల్డ్‌’లోకి పక్షిరాజా
close
Published : 31/01/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక అక్షయ్‌ వంతు.. ‘వైల్డ్‌’లోకి పక్షిరాజా

బెంగళూరు: కర్ణాటక అడవుల్లో చేపట్టిన ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ డాక్యుమెంటరీ షూటింగ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రెండు రోజుల పాటు పాల్గొన్నారు. మూడు రోజుల ఈ షెడ్యూల్‌లో ఆఖరి రోజు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ పాల్గొననున్నాడు. ఇందుకోసం అక్షయ్‌కుమార్‌ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఇందులో భాగంగా ఆయన సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహస కృత్యాలు చేయనున్నాడు. రజనీ తర్వాత ఈ డాక్యుమెంటరీలో పాల్గొంటున్న అక్షయ్‌.. మూడో భారతీయుడు కానున్నాడు. గతంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ డ్యాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ ప్రపంచవ్యాప్తంగా 3.6 మిలియన్ల మంది వీక్షించారు. ఈ డాక్యుమెంటరీ చరిత్రలో ఇదే రికార్డని యాజమాన్యం తెలిపింది. తాజా ఎపిసోడ్‌ ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. ‘2.ఓ’లో రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ కలిసి నటించిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని