‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మహేశ్‌, అమితాబ్‌..?
close
Published : 03/02/2020 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మహేశ్‌, అమితాబ్‌..?

హైదరాబాద్‌: సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ అగ్రకథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. మహేశ్‌బాబు, అమితాబ్‌బచ్చన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందంలో చేరుతున్నారట. కాకపోతే వాళ్లు కనిపించరు.. వినిపిస్తారంతే. టాలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా తెలుగు వెర్షన్‌కు మహేశ్‌, హిందీ వెర్షన్‌కు అమితాబ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారట. ఈ మేరకు రాజమౌళి.. అమితాబ్‌, మహేశ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తమిళం, మలయాళ వెర్షన్లకు ఏ హీరోలతో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించాలనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయానికి రాలేదట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌.. రామ్‌చరణ్‌కు జంటగా కనిపించనున్నారు. అలాగే హాలీవుడ్‌ నటి ఒలివియా మోరీస్‌ ఎన్టీఆర్‌ పక్కన సందడి చేయనున్నారు. వీరితోపాటు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, రాయ్‌ స్టీవెన్‌సన్‌, ఎలిసిన్‌ డ్యూడీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని