‘మే’ వరకూ జీతాలిచ్చేశాను..!
close
Published : 23/03/2020 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మే’ వరకూ జీతాలిచ్చేశాను..!

చేతనైనంత సాయం చేస్తా: ప్రకాశ్‌రాజ్‌

హైదరాబాద్‌: తన ఇంట్లో పనిచేసేవాళ్లకి, తన వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ ఇవ్వాల్సిన జీతాలను ప్రకాశ్‌ రాజ్‌ ముందే అందించేశారు. దేశంలో కరోనావైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో దాని నిర్మూలనలో భాగంగా సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. నటీనటులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఆయా సినిమాల కోసం పనిచేసే కొందరికి పనుల్లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌.. తన దగ్గర పనిచేసే వాళ్లందరికీ మే నెల వరకూ జీతాలను ముందే ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు.

‘‘జనతా కర్ఫ్యూ’.. నేను దాచుకున్న డబ్బులను పరిశీలించాను. నా నివాసం, వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నవారితోపాటు నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ ఇవ్వాల్సిన జీతాలను ముందే చెల్లించాను. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా వాయిదాపడిన నా మూడు సినిమాల కోసం పనిచేస్తోన్న రోజువారీ పనివారికి కనీసం సగం జీతాలైన అందించాలనే ఆలోచనలో ఉన్నాను. నేను ఎంతవరకూ సాయం చేయగలనో అంతవరకూ చేస్తాను. మీ చుట్టూ ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి. ఒకరికోసం ఒకరూ సాయం చేసుకోవాల్సిన సమయమిది’ అని ప్రకాశ్‌ రాజ్‌ విజ్ఞప్తి చేశారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని