సేవ్‌ అమరావతి నినాదం కావాలి: చంద్రబాబు
close
Published : 18/01/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సేవ్‌ అమరావతి నినాదం కావాలి: చంద్రబాబు

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, నారా లోకేశ్‌, కనకమేడల రవీంద్ర, టీడీ జనార్దన్‌, వర్ల రామయ్య, కాలువ శ్రీనివాసులుతో పాటు పలువురు తెదేపా నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా  చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్‌ పరితపించారు. ఎన్టీఆర్‌ మాదిరిగా విభిన్న పాత్రలు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. తన పాత్రలతో ప్రజలను ప్రభావితం చేశారు. జలవనరులపై అవగాహనతో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ ఎక్కుడున్నా అమరావతిని చూసి ఆనందపడేలా శ్రీకారం చుట్టాం. అలాంటి అమరావతి నేడు కష్టాల్లో ఉంది. అందరూ తప్పని చెబుతున్నా ప్రభుత్వం ముందుకెళ్తోంది. అమరావతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ అమరావతి  ప్రతి ఒక్కరి నినాదం కావాలి’’ అని చంద్రబాబు అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని