75శాతం కరోనా కేసుల్లో లక్షణాల్లేవ్‌: కేజ్రీవాల్‌
close
Published : 11/05/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

75శాతం కరోనా కేసుల్లో లక్షణాల్లేవ్‌: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశంలో లక్షణాలు కనిపించకుండానే కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దిల్లీలో నిర్ధారణ అయ్యే కేసుల్లో దాదాపు 75శాతం లక్షణాలు కనిపించడంలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే బయటపడుతున్నాయని.. ఇలాంటి వారికి ఇంటివద్దే చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాకుండా ప్రైవేటు అంబులెన్సు సర్వీసులకు కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్లవద్దని..వారందరినీ ప్రత్యేక రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తామని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే, దిల్లీలో ఇప్పటివరకు 6542 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 73మంది మృత్యువాతపడ్డారు.  

ఇంజిన్‌ నుంచి విడిపోయిన రైలు బోగీలు..

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలిస్తున్న రైలుకు ప్రమాదం తప్పింది. సురత్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్న శ్రామిక్‌ రైలుకు ఉన్న 20బోగీలు ఇంజిన్‌తో విడిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు 30కి.మీ దూరంలో ఉన్న ఇటరాసి-జబల్‌పూర్‌ మధ్య ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలా కొద్దిదూరం ప్రయాణించిన రైలును లోకో పైలట్లు గుర్తించారు. తిరిగి బోగీలను అనుసంధానించిన తరువాత రైలు బయలుదేరినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేకంగా శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 350శ్రామిక్‌ రైళ్ల ద్వారా 3లక్షల 60వేల మందిని తరలించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని