పిల్లల్లో కరోనా చిత్తు!
close
Updated : 06/10/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల్లో కరోనా చిత్తు!

అదృష్టం కొద్దీ కొవిడ్‌-19 పిల్లలపై అంత తీవ్రంగా విరుచుకుపడటం లేదు. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో చాలామందికి మావలు దశలోనే తగ్గిపోతోంది. దీనికి కారణం- పిల్లల్లో సహజసిద్ధ రోగనిరోధక వ్యవస్థ (ఇన్నేట్‌ ఇవ్యనిటీ) బలంగా ఉండటమేనని తొలిసారిగా బయటపడింది. మనలో రెండు రకాల రోగనిరోధక వ్యవస్థలుంటాయి. ఒకటి- సహజసిద్ధ రోగనిరోధకశక్తి. ఇది అన్నిరకాల హానికారక క్రిములను ఎదుర్కొంటుంది. చిన్నవయసులో మరింత శక్తిమంతంగానూ ఉంటుంది. రెండోది- సంతరిత (అడాప్టివ్‌) రోగనిరోధకశక్తి. ఇది ఇన్‌ఫెక్షన్ల ప్రభావానికి గురైనప్పుడు ప్రేరేపితమవుతుంది. ఆయా వైరస్‌, బ్యాక్టీరియాలను ఎదుర్కోవటానికి ప్రత్యేకమైన యాంటీబాడీలను తయారుచేసుకొని పెట్టుకుంటుంది. సహజసిద్ధ రోగనిరోధక ప్రతిస్పందనతో ముడిపడిన సైటోకైన్ల స్థాయులు.. ముఖ్యంగా ఐఎల్‌-17ఏ మోతాదులు పెద్దల్లో కన్నా పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇదే పిల్లలను హఠాత్తుగా ఊపిరితిత్తులు విఫలమయ్యే స్థితికి చేరకుండా కాపాడుతోందని భావిస్తున్నారు. పెద్దవారితో పాటు పిల్లల్లోనూ కరోనా వైరస్‌ ముల్లు ప్రొటీన్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు బాగానే తయారవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. హానికారక క్రిములను ప్రతిఘటించే న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు వీటిలో భాగమే. ఇవి పిల్లల్లో కన్నా పెద్దవారిలోనే చాలా ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. చిత్రమేంటంటే- జబ్బు నుంచి కోలుకున్నవారితో పోలిస్తే కొవిడ్‌-19తో చనిపోయిన లేదా వెంటిలేటర్‌ అమర్చినవారిలోనే న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీల స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు తేలటం. వీరిలో ఊపిరితిత్తుల వైఫల్యానికి దారితీసే రోగనిరోధక ప్రతిస్పందన అతిగా ప్రేరేపితమవుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఊపిరితిత్తుల వైఫల్య లక్షణాలు కనిపించినవారికి యాంటీబాడీల కోసం ఉద్దేశించిన ప్లాస్మా చికిత్స ఉపయోగపడకపోవచ్చనీ భావిస్తున్నారు. కరోనా జబ్బుకు మందులు, టీకాల తయారీలో అధ్యయన ఫలితాలు కీలక పాత్ర పోషించగలవని ఆశిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని