‘రెబల్‌’తో ‘కేజీఎఫ్‌’ దర్శకుడు? - is prasanth neel penning a story for prabhas
close
Updated : 12/08/2020 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రెబల్‌’తో ‘కేజీఎఫ్‌’ దర్శకుడు?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌లో మాస్‌ ఎలిమెంట్‌ ఎలివేట్‌ చేస్తే... ఆ సినిమా ఏ రేంజి హిట్‌ సాధిస్తుందో మనందరికీ తెలిసిందే. ఆ కటౌట్‌కి తగ్గ కథ తీసుకొస్తే సాధించే విజయం మామూలుగా ఉండదు. అలాంటి హీరోకు.. మాస్‌ ఎలివేషన్స్‌ ఇవ్వడంలో దిట్ట అయిన దర్శకుడు దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ దర్శకుడు ఎవరో. ‘కేజీఎఫ్‌’తో మొత్తం భారతీయ చిత్రపరిశ్రమను షేక్‌ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన తర్వాత సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుందని ఇప్పటివరకు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో సినిమా గురించి చర్చ మొదలైంది. 

ప్రభాస్‌ కోసం ప్రశాంత్‌ నీల్‌ ఓ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిద్ధం చేస్తున్నాడని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. దీనికి సంబంధించి ప్రాథమిక ఆలోచనలు, మంతనాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా ఓ రూపుదాల్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. ‘జిల్‌’ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధే శ్యామ్‌’ ఒకటి కాగా, మరొకటి నాగ్‌ అశ్విన్‌ సినిమా. ఈ రెండూ పూర్తయ్యాక ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుందని సమాచారం. అలాగే ప్రశాంత్‌ నీల్‌... ఎన్టీఆర్‌ సినిమా పూర్తి చేసుకున్నాక ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మొదలుపెడతారని అంటున్నారు. 

ఇటీవల విడుదలైన ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణను త్వరలో ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. దీని కోసం విదేశాలకు వెళ్లాలని చూస్తోంది. మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌ 2’ కూడా అదే స్థితిలో ఉంది. యశ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆ సినిమాలో సంజయ్‌దత్‌ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని