దేశం కోసం యుద్ధం చేశా.. నా కొడుకును కాపాడలేకపోయారు  - kargil veteren son died of covid 19
close
Published : 30/04/2021 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశం కోసం యుద్ధం చేశా.. నా కొడుకును కాపాడలేకపోయారు 

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘మాతృభూమిని శత్రుమూకల నుంచి కాపాడేందుకు యుద్ధంలో పాల్గొన్నా.. కానీ, నేడు ఈ వ్యవస్థ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టలేకపోయింది’’ ఓ కార్గిల్‌ సైనికుడి ఆవేదన ఇది. రెండో దశలో కరోనా మహమ్మారి మరింత ఘోరంగా విరుచుకుపడుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరీ మీదా ప్రతాపం చూపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన హరిరాం దుబే 31 ఏళ్ల కుమారుడు కూడా ఇటీవల కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే కన్నకొడుకును చివరిసారి చూసుకునేందుకు కూడా తాము ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘1981 నుంచి 2011 వరకు మాతృభూమికి సేవ చేశా. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని పాకిస్థాన్‌పై పోరాడా. బారామ్లా, లద్దాఖ్‌ వంటి ప్రాంతాల్లో పనిచేసి ఉగ్రవాదులను ఏరిపారేశా. కానీ, నేడు ఈ దేశంలో ఉన్న వ్యవస్థ నా కొడుకును కాపాడలేకపోయింది. చెట్టంత కొడుకును కోల్పోయిన దుఃఖంలో ఉన్న మేం అతడి కడచూపు కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ పేపర్లు ఈ పేపర్లు అంటూ తిప్పించారు’’ అంటూ సుబేదార్‌ మేజర్‌(రిటైర్డ్‌) హరిరామ్‌ దుబే ఆవేదన వెళ్లగక్కారు. హరిరాం కుమారుడు 31ఏళ్ల అమితాబ్‌ గత మంగళవారం కొవిడ్‌తో మృతిచెందారు.  

ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభించింది. అక్కడ రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కాన్పూర్‌లో అయితే పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ ఖాళీలేని స్మశాసనవాటికలు వైరస్‌ ఉద్ధృతికి అద్దం పడుతున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని