‘ఖైదీ 2’ ఎప్పుడంటే.. రష్మిక నటికాకపోయి ఉంటే - karthi live with rashmika
close
Published : 08/04/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఖైదీ 2’ ఎప్పుడంటే.. రష్మిక నటికాకపోయి ఉంటే

ఇంటర్నెట్‌ డెస్క్: ‘నాకు తెలుగు అంతగా రాదు. స్పష్టంగా మాట్లాడలేను’ అన్నారు తమిళ నటుడు కార్తి. ఆయన హీరోగా నటించిన ‘సుల్తాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నాయిక రష్మికతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు కార్తి. ఈ క్రమంలో ఓ అభిమాని తెలుగులో మాట్లాడండి అని అడగ్గా తెలుగు కొంచెం కొంచెం తెలుసని సమాధానమిచ్చారాయన. అభిమానులతో ఈ ఇద్దరి సంభాషణ ఎలా సాగిందో చూడండి..

కశ్మీర్‌ గురించి చెప్పండి?

కార్తి:  నేను రెండేళ్ల క్రితం కశ్మీర్‌ వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం అది.

సుల్తాన్‌ సినిమా ఎందుకు చూడాలి?

కార్తి: మంచి వినోదం అందించే సినిమా ‘సుల్తాన్‌’. యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌, రొమాన్స్‌.. ఇలా నవరసాలు ఇందులో ఉంటాయి. 

‘ఖైదీ’ సినిమా విడుదలకు ముందు మీ అభిప్రాయం?

కార్తి: ‘ఖైదీ’ విభిన్నమైన చిత్రం. యాక్షన్‌ కంటే ఎక్కువ ఎమోషన్‌ ఉంది అందులో. ప్రతి సన్నివేశం అత్యద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు లోకేశ్‌. నటుడిగా నన్ను ఓ మెట్టు పైకి ఎక్కించింది. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. సినిమా విడుదలకు ముందే విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది.

‘ఖైదీ 2’ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

కార్తి: ఈ ఏడాది చివర్లో లేదా 2022 ప్రధమార్థంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రశ్న దర్శకుడు లోకేశ్‌ని అడిగితే బాగుంటుంది (నవ్వుతూ).

మీ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర అంశం ఏదైనా చెప్పండి?

కార్తి: ‘సుల్తాన్‌’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చేస్తున్నాను. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. చరిత్రాత్మక నేపథ్యంలో సాగే కథ ఇది. ఐశ్వర్య రాయ్‌, విక్రమ్‌, జయరాం, జయం రవి వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది.

ప్రస్తుతం ఏఏ చిత్రాల్లో నటిస్తున్నారు?

రష్మిక: తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు. హిందీలో మిషన్‌ మజ్ను, గుడ్‌ బై చిత్రాలు చేస్తున్నాను.

రష్మిక నటి కాకపోయి ఉంటే?

నాన్న వ్యాపారం చూసుకునేదాన్ని లేదా టీచర్‌ అయ్యేదాన్ని. 
 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని