ఉత్కంఠ పోరులో ముంబయిదే విజయం - mi vs csk- mumbai indians won by 4 wickets
close
Updated : 02/05/2021 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్కంఠ పోరులో ముంబయిదే విజయం

చెలరేగిన పొలార్డ్

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి మళ్లీ మెరిసింది. దిల్లీ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (35; 24 బంతుల్లో 4×4, 1×6), డికాక్‌ (38; 28 బంతుల్లో 4×4, 1×6) శుభారంభం అందించారు. ప్రమాదకరంగా మారుతున్న రోహిత్ శర్మను శార్దూల్‌ వెనక్కి పంపించాడు. డికాక్‌.. మొయిన్ అలీ ఔట్‌ చేశాడు. సూర్యకుమార్(3) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కీరన్‌ పొలార్డ్(87; 34 బంతుల్లో 6×4, 8×6) విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో విరుచుకుపడుతూ 17 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. కృనాల్‌ పాండ్య (32; 23 బంతుల్లో 2×4, 2×6) ఉన్నంతసేపూ మెరుపులు మెరిపించాడు. ధాటిగా ఆడుతున్న కృనాల్‌ను సామ్‌కరన్‌  వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య( 16; 7 బంతుల్లో 2×6) ధాటి ఆడే క్రమంలో సామ్‌కరన్‌ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన జిమ్మీ నిషమ్(0) డకౌటయ్యాడు. ముంబయి విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమైన దశలో ఎంగిడి బౌలింగ్‌లో పొలార్డ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి ముంబయిని విజయ తీరాలకు చేర్చాడు. పొలార్డ్‌ ‘మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.

ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన..నిర్ణీత ఓవర్లలో 218  పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్(4)ని తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్‌ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 4×6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో  5×4, 5×6) రాణించారు. ధాటిగా ఆడుతున్న అలీ బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత ఓవర్లోనే డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా(2)లను పొలార్డ్‌ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (72; 27 బంతుల్లో 4×4; 7×6) సిక్సర్లతో విరుచుపడ్డాడు. జడేజా 22 పరుగులు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోరును సాధించింది. ముంబయి బౌలర్లలో పొలార్డ్‌ 2, బౌల్ట్‌, బుమ్రా చెరో వికెట్ తీశారుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని