ఆలయాల రక్షణపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలి - pawan kalyan comments on temple issue in ap
close
Published : 07/01/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలయాల రక్షణపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: రాష్ట్రంలో హిందూ ఆలయాల రక్షణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. ఈ మేరకు గురువారం పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన తర్వాత రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే, ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఇటీవల రామతీర్థంలో కోదండరామ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత కూడా ప్రభుత్వం అదే మాట చెప్పడాన్ని పవన్‌ తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో 26వేల ఆలయాలు ఉంటే.. అందులో ఎన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ధూపదీప నైవేద్యాలకు నిధులివ్వని ప్రభుత్వం.. ఇప్పుడు సీసీ కెమెరాల బాధ్యత ఆలయాలదేనని చెప్పడం బాధ్యత నుంచి తప్పుకోవడమేనన్నారు.

కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీద పెట్టే శ్రద్ధ ఆలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విషయంలోనూ పెట్టాలని పవన్‌ అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలను అమర్చటంతో పాటు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే.. కేవలం ప్రకటనలు, ప్రచారం కోసం మాత్రమే సీసీ కెమెరాల గురించి ప్రభుత్వం మాట్లాడుతోందని భావించాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాలను తిరిగి కడుతున్నామని చెప్పే ప్రభుత్వం.. గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమేనని.. హిందూధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులేంకావని పవన్‌ చెప్పారు.

ఇవీ చదవండి..
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: తెదేపా

కిడ్నాప్‌ కేసులో ఏ1గా అఖిలప్రియమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని