ప్రధాని మోదీ, బైడెన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ - pm modi and usa president joe biden speak on phone
close
Updated : 27/04/2021 05:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రధాని మోదీ, బైడెన్‌ మధ్య ఫోన్‌ సంభాషణ

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో పలు దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. అమెరికా, ఈయూ, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలు ఈ కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటామంటూ పేర్కొన్నాయి. కరోనా టీకా కొవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడిపదార్థాలు పంపిస్తామంటూ అమెరికా  ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మధ్య టెలిఫోన్‌ సంభాషణ జరిగింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇరు దేశాల్లో కరోనా పరిస్థితిని చర్చించాం. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన బైడెన్‌కు ధన్యవాదాలు. వ్యాక్సిన్‌ ముడి పదార్థాల సమర్థవంతమైన సరఫరా ప్రాముఖ్యతపై కూడా చర్చించాను. ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న కొవిడ్‌-19 మహమ్మారి సంక్షోభాన్ని భారత్‌-అమెరికా ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యం పరిష్కరించగలదు’’ అని ప్రధాని ట్విటర్‌లో తెలిపారు. 

కరోనా చికిత్సలో వాడే వెంటిలేటర్లు, కిట్లు, వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించిన ముడిపదార్థాలను అమెరికా పంపించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్‌లో కరోనా ఉద్ధృతికి అడ్డుకట్టవేయడానికి వేగవంతమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం, అత్యవసర మందులు సరఫరాపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.   మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని