Gun Fire: సెట్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌.. సినిమాటోగ్రఫర్‌ మృతి - prop gun fired by alec baldwin kills cinematographer director hurt cops
close
Published : 22/10/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gun Fire: సెట్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌.. సినిమాటోగ్రఫర్‌ మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాలీవుడ్‌ సినిమా సెట్‌లో ప్రధాన పాత్రధారి తుపాకీని మిస్‌ఫైర్‌ చేసిన ఘటనలో సినిమాటోగ్రఫర్ మృతి చెందగా.. దర్శకుడు గాయపడ్డారు. స్థానిక పోలీసులూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికా నటుడు అలెక్ బాల్డ్విన్ తాను నటిస్తూ, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రస్ట్‌’ సినిమా చిత్రీకరణ కొన్నాళ్లుగా న్యూ మెక్సికోలోని ఓ సెట్‌లో జరుగుతోంది. షూటింగ్‌ క్రమంలో ఆయన చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. దీంతో సినిమాటోగ్రఫర్‌ హాలినా హచిన్స్‌(42), దర్శకుడు జోయెల్ సౌజాకు గాయాలయ్యాయి. హాలినాను హుటాహుటిన హెలికాప్టర్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ.. పరిస్థితి విషమించి ఆమె మృతి చెందారు. మరోవైపు డైరెక్టర్‌ చికిత్స పొందుతున్నారు.

బాల్డ్విన్ స్టేట్‌మెంట్‌ నమోదు..

ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. బాల్డ్విన్‌ను మాత్రం విచారించి, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనతో మొత్తం సినిమా సిబ్బంది దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రొడక్షన్‌ హౌజ్‌ ప్రతినిధులు తెలిపారు. హాలినా కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి షూటింగ్‌ నిలిపివేసినట్లు, పోలీసుల విచారణకు సహకరిస్తున్నట్లు వివరించారు. హచిన్స్ మృతిపై ఇంటర్నేషనల్ సినిమాటోగ్రఫర్స్ గిల్డ్‌ స్పందిస్తూ.. ఈ ఘటన విషాదకరమని పేర్కొంది. గతంలోనూ ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ కుమారుడు బ్రాండన్ లీ సైతం ‘ది క్రో’ సినిమా చిత్రీకరణ సమయంలో తుపాకీ పేలిన ఘటనలో మృతి చెందాడు. తాజా ఘటనపై బ్రాండన్ సోదరి షానన్ లీ ట్వీట్‌ చేస్తూ.. సినిమా సెట్‌లో ఎవరూ తుపాకీ కాల్పులతో చనిపోకూడదు అని పేర్కొన్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని