Bollywood: రాధికా ఆప్టే ‘ఫోరెన్సిక్‌’ - radhika apte new movie titles as forensic
close
Published : 29/07/2021 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: రాధికా ఆప్టే ‘ఫోరెన్సిక్‌’

ముంబయి: వెండితెరతో పాటు డిజిటల్‌ తెరపైనా కొన్నేళ్లుగా సత్తా చాటుతున్నారు రాధికా ఆప్టే, విక్రాంత్‌ మస్సే. ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరూ తొలిసారి కలిసి నటించనున్నారు. థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘ఫోరెన్సిక్‌’ అనే పేరుని ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. విశాల్‌ ఫ్యురియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ ‘‘ఫోరెన్సిక్‌ లాంటి థ్రిల్లర్‌లో నటించనుండటం చాలా ఆనందంగా ఉంది. విక్రాంత్, విశాల్‌తో కలిసి పనిచేయడం కోసం ఆసక్తిగా చూస్తున్నాను’’అని చెప్పింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని