IPL 2021: మేటి జట్ల మధ్య రసవత్తర పోరు..  - royal challengers bangalore gear up for chennai super kings challenge in ipl 2021
close
Updated : 24/09/2021 21:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: మేటి జట్ల మధ్య రసవత్తర పోరు.. 

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మొదటి దశలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మెరుగ్గా రాణించింది. ఏడు మ్యాచులు ఆడి ఐదింట్లో విజయం సాధించింది. రెండో దశలో కూడా అదే స్థాయిలో ఆడాలని అభిమానులు ఆశించారు. అయితే, ఎవరూ ఊహించని రీతిలో మలి దశ మొదటి మ్యాచులో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో భంగపాటుకు గురైంది. వెంట వెంటనే వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తర్వాతి మ్యాచులో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో ఉంది బెంగళూరు. అయితే, ఆ జట్టు తలపడబోయేది గత మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ని ఓడించి మంచి జోష్‌ మీద ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ రసవత్తరంగా ఉండనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపించారు. ఆ వీడియోను ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఈ సీజన్‌ మలిదశలో ధోని సారథ్యం వహిస్తున్న సీఎస్కే, కోహ్లి నాయకుడిగా వ్యవహరిస్తున్న బెంగళూరు జట్లు తొలిసారి తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని