ఇదే రోజు.. 43 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే! - siva shankar varaprasad turns into chiranjeevi on feb 11th
close
Published : 11/02/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదే రోజు.. 43 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే!

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి కెరీర్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 11) చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే కొణిదెల శివశంకర్‌ వరప్రసాద్‌ అనే సాధారణ వ్యక్తిని మెగాస్టార్‌ చిరంజీవిగా మార్చింది ఈ రోజే. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో పుట్టిన చిరు నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశారు. తనలోని నటుడ్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిరు ఎన్నో కష్టాలు పడిన సంగతి తెలిసిందే. వాటన్నింటినీ అధిగమించి  1978 ఫిబ్రవరి 11న తొలిసారి కెమెరా ముందుకొచ్చారాయన. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఈ సినిమాలోని కీలక సన్నివేశాన్ని 43 ఏళ్ల క్రితం అంటే 1978 ఫిబ్రవరి 11న చిరుపై చిత్రీకరించారు. అదే చిరు నటించిన తొలి సీన్‌. ఆంధ్రప్రదేశ్‌లోని దోసకాయలపల్లి (తూర్పు గోదావరి జిల్లా) గ్రామంలో ఈ షూటింగ్‌ నిర్వహించారు.

ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ కొన్నాళ్లపాటు టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడుగా కొనసాగారు చిరంజీవి. రీ ఎంట్రీలోనూ అదే జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. మోహన్‌ రాజా, మెహర్‌ రమేష్‌, బాబీతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి..

చిరు-బాబీ.. సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందట!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని