Love story: చై-సాయి పల్లవిల ‘లవ్‌స్టోరీ’ విడుదలయ్యేది అప్పుడేనా? - telugu cinema news naga chaitanya and sai pallavi love story will release on september
close
Published : 17/08/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Love story: చై-సాయి పల్లవిల ‘లవ్‌స్టోరీ’ విడుదలయ్యేది అప్పుడేనా?

హైదరాబాద్‌: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. క్లాసిక్‌, కూల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాక విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు.  ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల సమస్య కొలిక్కి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి సెకండ్‌ షో ప్రదర్శన కష్టం. అన్ని పరిస్థితులు అక్కడ అనుకూలం కాగానే... ఏ క్షణంలోనైనా ‘లవ్‌స్టోరి’ విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్‌లో వినాయక చవితి సందడి కూడా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అంటే సెప్టెంబరు 10 లేదా 17వ తేదీల్లో ఏదో ఒక రోజున ‘లవ్‌స్టోరీ’ ప్రేక్షకులను పలకరించనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. పవన్‌ సీహెచ్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని ‘సారంగదరియా’ పాట యువతను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని