TS News: అభిమానంతో గుడి కట్టి.. ఆవేదనతో విక్రయానికి సిద్ధమై..! - telugu news Build a temple with affection and ready to sale
close
Updated : 21/09/2021 07:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: అభిమానంతో గుడి కట్టి.. ఆవేదనతో విక్రయానికి సిద్ధమై..!

కేసీఆర్‌ విగ్రహం ఎదుట గుండ రవీందర్‌ దంపతులు

దండేపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆయనకు ఇంట్లోనే గుడి కట్టి విగ్రహం ప్రతిష్టించాడు దండేపల్లి గ్రామానికి చెందిన గుండ రవీందర్‌. అంతగా అభిమానించినా తనను పట్టించుకోవడం లేదంటూ.. ఆవేదనతో కొన్నిరోజుల క్రితం విగ్రహం ముఖాన్ని సంచులతో కప్పివేశాడు. తీరా ఇప్పుడు విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డానని, వేల రూపాయలు అప్పులు చేశానని, కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో గుడి కట్టినా నన్ను పట్టించుకోవడం లేదంటూ.. ఆయన ఇటీవల తెరాసకు రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఉద్యమంలో చేసిన అప్పులు చెల్లించడం ఇబ్బందిగా మారిందని దీంతో విగ్రహాన్ని విక్రయించడానికి సిద్ధపడినట్లు ఆయన పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని