Karthikeya: రాజా గారు బయటికొస్తే ప్రమాదమే పరారు! - telugu news actor karthikeya birtday surprizes from raja vikramarka vaalimai
close
Published : 21/09/2021 23:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 Karthikeya: రాజా గారు బయటికొస్తే ప్రమాదమే పరారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకుడు. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని తొలి గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ‘రాజా గారు బయటికొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే’ అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. కథానాయకుడి పాత్ర తీరుతెన్నుల్ని వివరిస్తోన్న ఈ పాటని కృష్ణకాంత్ రచించారు. డేవిడ్‌ సిమన్‌ ఆలపించారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు. తాన్యా రవిచంద్రన్‌ కథానాయికగా నటిస్తోంది. శ్రీ చిత్ర మూవీ మేకర్స్‌ పతాకంపై రామారెడ్డి నిర్మిస్తున్నారు.

విలన్‌ లుక్‌..

ప్రముఖ నటుడు అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వాలిమై’ సినిమాలో కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో కార్తికేయ సీరియస్‌ లుక్‌లో కనిపించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని