Bigg Boss Telugu5: రవి ప్లాన్‌.. అనీ మాస్టర్‌ వర్సెస్‌ ఉమ.. సిగ్గులేదా? - telugu news bigg boss telugu5 anee master vs uma
close
Updated : 15/09/2021 20:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu5: రవి ప్లాన్‌.. అనీ మాస్టర్‌ వర్సెస్‌ ఉమ.. సిగ్గులేదా?

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’లో పోటీదారుల మధ్య వాగ్యుద్ధం తారస్థాయి చేరింది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్‌ కోసం జరిగిన పోటీలో ఒకరిపై ఒకరు విమర్శల దాడి జరిగింది. నామినేషన్స్‌ సందర్భంగా ఇంటిలోని సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అదే గ్రూపు సభ్యులు కలిసి కెప్టెన్సీ టాస్క్‌ కోసం పోటీ పడాలని బిగ్‌బాస్‌ వారిని ఆదేశించాడు.

‘పంతం నీదా.. నాదా’ పోటీలో భాగంగా వివిధ టాస్క్‌లు చేయాలని బిగ్‌బాస్‌ తెలిపాడు. తొలి టాస్క్‌ ‘దొంగలున్నారు జాగ్రత్త’లో గ్రూపు సభ్యులు తమకు ఇచ్చిన బ్యాటన్స్‌ ప్రత్యర్థి గ్రూపునకు దక్కుకుండా జాగ్రత్త చేసుకోవాలని బిగ్‌బాస్‌ సూచించాడు. చివరకు ఏ టీమ్‌ దగ్గర ఎక్కువ ఫ్లాగ్స్‌ ఉంటే ఆ టీమ్‌ గెలిచిన జట్టుగా ప్రకటిస్తామని చెప్పాడు. ఈ క్రమంలో బ్యాటన్స్‌ను కాపాడుకునేందుకు మంగళవారం ఇరు జట్ల మధ్య గట్టి యుద్ధమే జరిగింది. బుధవారం ఈ పోరు మరింత రసవత్తరంగా సాగినట్లు తాజా ప్రోమోలను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా తమ గ్రూపును గెలిపించడానికి రవి ప్లాన్‌ చేయడం.. టాస్క్‌లో భాగంగా అనీ మాస్టార్‌, ఉమ మాటల యుద్ధానికి దిగారు. కాళ్లతో తన్నించుకోవడానికి బిగ్‌బాస్‌ షోకి రాలేదని శ్వేతవర్మ కెమెరా ముందు కాస్త గట్టిగానే చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ఏ జట్టు గెలిచింది? వారిలో ఎవరు కెప్టెన్‌ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని