Ts News: పాస్‌పోర్టుల జారీపై సికింద్రాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం కీలక నిర్ణయం - telugu news hundred percent appointments will be issued in all passport offices in telangana
close
Updated : 23/09/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts News: పాస్‌పోర్టుల జారీపై సికింద్రాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం కీలక నిర్ణయం

హైదరాబాద్: కొవిడ్‌ పరిస్థితులు చాలా వరకు మెరుగవడంతో పాస్‌పోర్టుల జారీకి వంద శాతం అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం నిర్ణయించింది. కొవిడ్‌ నిబంధనలతో ప్రస్తుతం పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లకు 7 నుంచి 12 రోజులు సమయం పడుతోంది. అపాయింట్‌మెంట్లు ఆలస్యం అవుతుండటంతో దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌ రూపంలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య స్పందించారు. తాజా పరిస్థితులను అధికారులతో సమీక్షించిన అనంతరం వందశాతం అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, 14 తపాలా సేవా కేంద్రాల్లో వందశాతం అపాయింట్‌మెంట్లు ఇచ్చే విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని బాలయ్య వెల్లడించారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తుందని వివరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని