JC Diwakar Reddy: ఏపీ వదిలి తెలంగాణకు వస్తా: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు - telugu news jc diwakar reddy intresting comments
close
Updated : 24/09/2021 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

JC Diwakar Reddy: ఏపీ వదిలి తెలంగాణకు వస్తా: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి, తెదేపా నేత జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చిన కేసీఆర్‌తో శాసనసభ ప్రాంగణంలో జేసీ కలిసి పలు అంశాలపై ముచ్చటించారు. అంతకుముందు సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పా. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసు. నాకు జానారెడ్డి మంచి మిత్రుడు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించి నాకు తెలియదు. రాజకీయాలు బాగోలేవు.. సమాజం కూడా బాగోలేదు. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తా. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’’ అని జేసీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దు..

సీఎల్పీలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జేసీకి సూచించారు. ఏవైనా వ్యాఖ్యలు చేయాలంటే సీఎల్పీ బయట మాట్లాడాలని గట్టిగా చెప్పారు. మరోసారి షోకాజ్‌ నోటీసులు వచ్చేలా మాట్లాడబోనని జేసీ చెప్పారు. తాను పుట్టింది, పెరిగింది, అభివృద్ధి చెందింది కూడా కాంగ్రెస్‌ పార్టీలోనేనని వెల్లడించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఎప్పుడూ కలవలేదని.. అందుకే ఇప్పుడు కలిశానన్నారు. ఎన్నికల ఖర్చు బాగా పెరిగిపోయిందన్న దివాకర్‌రెడ్డి.. 1980లో సమితి ప్రెసిడెంట్‌కు రూ.10వేలు ఖర్చు అయ్యాయన్నారు. ఇప్పుడు ఎంపీగా నిలబడితే రూ. 50 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని