Varun Tej: ‘గని’ ఆగమనం ఎప్పుడంటే? - telugu news varun tej movie ghani release date announcement
close
Published : 05/08/2021 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varun Tej: ‘గని’ ఆగమనం ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా (లాక్‌డౌన్‌) కారణంగా వాయిదా పడింది. పాత్రకి తగ్గట్టు తనని తాను మార్చుకున్నాడు వరుణ్‌. ఇందుకు ఇంగ్లాడ్‌కి చెందిన మాజీ బాక్సర్‌ టోనీ జెఫ్రీస్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. మరోవైపు హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ లార్నెల్‌ స్టోవల్‌, వ్లాడ్‌ రింబర్గ్‌ ఈ చిత్రానికి పనిచేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వరుణ్‌ సరసన బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని