‘ధక్‌ ధక్‌ ధక్‌’.. ఇలా తెరకెక్కించారు - uppena making
close
Published : 25/04/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ధక్‌ ధక్‌ ధక్‌’.. ఇలా తెరకెక్కించారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’ నుంచి మరో మేకింగ్‌ వీడియో విడుదలైంది. వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రమిది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు, పాటలకు సంబంధించిన మేకింగ్‌ వీడియోల్ని సినీ అభిమానులకు కానుకగా అందించింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్రంలోని సూపర్‌ హిట్‌ గీతం ‘ధక్‌ ధక్‌ ధక్‌’ తెర వెనక విషయాల్ని పంచుకుంది. చిన్న చిన్న కదలికల కోసం నాయకానాయికలు ఎంతగా శ్రమించారో ఈ వీడియోలో చూడొచ్చు. ఈ పాటలో నాయిక కృతి శెట్టి పలికించిన హావభావాలు కుర్రకారుని కట్టిపడేశాయి. సందర్భానికి తగినట్టు కృతి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ సైతం అదే స్థాయిలో సందడి చేశారు. బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది ఈ ప్రేమ కథా చిత్రం. ఈ అందమైన గీతాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ఎంత కష్టపడిందో చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని