హత్య కేసు నుంచి ఎలా బయటపడింది? - will parineeti chopra be able to escape
close
Published : 05/03/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హత్య కేసు నుంచి ఎలా బయటపడింది?

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రిభూ దాస్‌గుప్తా దర్శకత్వం వహించారు.  చిత్రం ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. సినిమా తెలుగులోనూ డబ్బింగ్‌ అయ్యింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, అంబ్లిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్‌ బి.అగర్వాల్‌, శిబాషిస్‌ సర్కార్‌ నిర్మాతలు. బ్రిటీష్‌ రచయిత పౌలా హాకిన్స్ రచించిన ‘ది గర్ల్ ఆన్‌ ది ట్రైన్’ నవల ఆధారంగా అదే పేరుతో 2016 హాలీవుడ్‌లో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని హిందీలో ‘ది గర్ల్ ఆన్‌ ది ట్రైన్’ పేరుతోనే రీమేక్‌ చేశారు. ప్రస్తుతం తెలుగులోనూ ఇది నెట్‌ఫ్లిక్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు డబ్బింగ్‌ వీడియోను నెట్‌ఫ్లిక్‌ పంచుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని