
హైదరాబాద్: యువ కథానాయకుడు నాగశౌర్య నటిస్తున్న తన 20వ చిత్రానికి ‘లక్ష్య’ అనే టైటిల్ ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ విషయాన్ని నాగశౌర్య స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాల భైరవ బాణీలు సమకూరుస్తున్నారు. నారాయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య ఆరుపలకల దేహంతో కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. నాగశౌర్య నటించిన ‘ఓ బేబీ’ మంచి విజయం అందుకున్నా.. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘అశ్వథ్థామ’ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. అయితే.. నాగశౌర్య మాత్రం తాజా సినిమాపై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్‌లుక్’ అభిమానులను బాగా ఆకట్టుకుంది.
ఇదీ చదవండి..
విల్లు ఎక్కు పెట్టనున్న నాగశౌర్య
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!
- తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
- కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
- 36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
- ‘ఓకే చైనా’ అనని అమెరికా!
- నేను బౌలర్‌ను మాత్రమే కాదు.. ఆల్‌రౌండరని పిలవొచ్చు
- ‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్
- అసహజ బంధం.. విషాదాంతం
- నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్ఇండియా
- చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!