సెట్‌ పనులు షురూ
close
Published : 24/07/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెట్‌ పనులు షురూ

‘ఆచార్య’ సినిమా పూర్తయిన వెంటనే ‘లూసీఫర్‌’ రీమేక్‌ కోసం రంగంలోకి దిగనున్నారు చిరంజీవి. ఇది ఆయన చేయనున్న 153వ చిత్రం. మోహన్‌రాజా దర్శకుడు. రామ్‌చరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. దీనికి తగ్గట్లుగా ఇప్పటికే సంగీత పనులు ప్రారంభించారు. తాజాగా ఈ చిత్ర సెట్‌ నిర్మాణ పనులను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. ‘‘కొత్తది ఏదైనా ఆనందాన్నిస్తుంది. కొత్తరోజు కొత్త ప్రారంభం. ‘చిరు153’ చిత్రం కోసం సెట్‌ వర్క్‌ ప్రారంభిస్తున్నాను’’ అని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. సెల్వరాజన్‌ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా కోసం భారీ టెంపుల్‌ టౌన్‌ సెట్‌ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే తరహాలో ఆయన ఈ ‘లూసీఫర్‌’ రీమేక్‌ కోసం మరో భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని