Radhika: అశ్లీల వీడియో.. మా డ్రైవర్‌ గుర్తుపట్టాడు - my driver recognised me from the images says the parched actor
close
Updated : 22/05/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radhika: అశ్లీల వీడియో.. మా డ్రైవర్‌ గుర్తుపట్టాడు

నాలుగు రోజులు గడప దాటలేకపోయా!

ముంబయి: నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ.. ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే. హీరోయిన్‌గా కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఎక్కడా రాజీ పడకుండా పాత్ర కోసం ఎంతటి సాహసాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉండే ఈ భామ ఒకానొక సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఓ సినిమా కోసం చేసిన ఓ సాహసం కారణంగా ఆమె నాలుగురోజులు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.

‘నటిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమించాను. ఎన్నో సాహసాలు చేశాను. 2015లో నేను నటించిన ‘పార్చ్‌డ్‌’ వల్ల ఇబ్బందులు పడ్డాను. స్త్రీ విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌’లో కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నేను కనిపించాను. ఆ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయడానికంటే ముందు టోరెంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దాంతో నేను నటించిన అశ్లీల సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకున్నారు. నాపై విమర్శల వర్షం కురిపించారు. నా డ్రైవర్‌, వాచ్‌మెన్‌, అలాగే నా స్టైలిష్ట్‌.. ఇలా ప్రతిఒక్కరూ నన్ను గుర్తుపట్టారు. దాంతో నేను నాలుగు రోజులు ఇంటి గడప దాటలేదు. ఎంతో బాధగా అనిపించింది. కానీ అలాంటి చిత్రంలో నటించినందుకు ఒకింత ఆనందంగా ఉంది. నాకు చెడ్డ పేరు రావడానికి బదులు.. సినిమాకి మంచి పేరు వచ్చివుంటే ఎంతో బాగుండేది’ అని రాధిక వివరించారు.

అనంతరం ‘రక్తచరిత్ర’ సమయంలో రామ్‌గోపాల్‌వర్మ చేసిన పని కారణంగా తాను బాధపడ్డానని నటి తెలిపారు. తనకి ఆ సినిమాలో ఆఫర్‌ ఇచ్చినప్పుడు కేవలం తెలుగు చిత్రమనే చెప్పారని.. కానీ షూటింగ్‌ సమయంలో తెలుగు, తమిళ భాషల్లోనూ ‘రక్తచరిత్ర’ తెరకెక్కించారని ఆమె అన్నారు. అంతేకాకుండా తనకి ఒక సినిమాకి ఇచ్చే పేమెంట్‌ మాత్రమే ఇచ్చారని రాధిక వాపోయారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని